మంత్రి ఈటల మదనపడుతున్నారా?.. ఎందుకోసం?

539

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడే మాటలు ఒక్కోసారి రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తుంది. గతంలో కూడా రెండు మూడుసార్లు నర్మగర్భంగా ఏదో రాజకీయ అంశాలపై మదనపడుతున్నట్లుగా మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీనే మాదంటూ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు కూడా రైతులు.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఏదో మధనపడుతూ మాట్లాడుతున్నట్లుగా కనిపించారు. గత మూడు రోజులుగా జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఈటల శుక్రవారం కూడా రైతులకు సంపూర్ణ మద్దతు అనే స్వరం వినిపిస్తున్నారు.

నేడు మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే ఏదో అయనను అడ్డుకుంటుందేమో అనేవిధంగా కనిపిస్తున్నాయి. ఈ దేశంలో రైతు ఏడవద్దని నిర్ణయించుకుంటున్నం..నేను మంత్రిగా ఉండోచ్చు.. లేకపోవచ్చు.. ఇంకోక దగ్గర ఉండవచ్చు.. సమ్మెలు.. కానీ అందోళనలు చేసే రైతులకు మాత్రం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు మంత్రి. మాకు కొన్నిఇబ్బందులు ఉండవచ్చు కాని మాకు ఆత్మ అంటూ ఒకటి ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు. రైతులు.. రైతు అందోళనలపై మా వైఖరి అదే విధంగా ముందుకు సాగుతుందని ప్రకటించారు.

ఇక పార్టీపై కూడా మాట్లాడిన ఈటల తనకు సీఎం కేసీఆర్‌తో 20 ఏళ్ల అనుభందం ఉందని.. ఇన్నేళ్ల సంబంధంలో నాకు కేసిఆర్ పై అజమాయిషీ ఉంటుందన్నారాయన. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన భాద్యత తనపై ఉందన్నారు. ఈ మాటలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజానికి కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ముందుగా టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం వ్యతిరేకించింది. అయితే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత చట్టాలపై మాట్లాడడం లేదని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక ఇప్పుడు.. మంత్రి ఈటల తమకు ఇబ్బందులు ఉంటాయని కానీ మనసు మాత్రం రైతులతోనే ఉందని చెప్పారు. పైగా నేను మంత్రిగా ఉండొచ్చు లేకపోవచ్చు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మంత్రి ఈటలను మంత్రి పదవి నుండి తొలగించే అవకాశం ఉందా? లేక అధిష్టానం నుండి వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అసలు ఈటల వ్యాఖ్యలు.. ఈటల బాధ దేని కోసం అనే విధంగా రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.

మంత్రి ఈటల మదనపడుతున్నారా?.. ఎందుకోసం?