జనవరి 9న అమ్మఒడి : మంత్రి సురేష్‌ వెల్లడి

65

వచ్చే ఏడాది జనవరి 9న అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇందుకోసం డిసెంబర్ 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితా గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ జాబితాలో అర్హులై పేరులేని వారు మళ్లీ నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పారు.

డిసెంబర్ 30న అమ్మఒడి తుది జాబితా ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇక ప్రైవేటు పాఠశాలలు ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలని.. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టవద్దని.. ఇలా ఏ యాజమాన్యమైనా చేస్తే సహించేది లేదని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.