దూసుకుపోతున్న ఒవైసి..అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నాం.

331

ఎంఐఎంను దేశ వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమంలో తోలి అడుగు ఈ ఏడాది జరుగుతున్న వివిధ రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పడేలా కనిపిస్తుంది. నాలుగు రాష్ట్రలో ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్దమవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి పశ్చిమ బెంగాల్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరో వైపు తమిళనాడు ఎన్నికలపై కూడా దృష్టిపెట్టారు. తమిళనాడులో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు అసదుద్దీన్ ఒవైసి.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఒవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు.” తాము తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థులు కొందరు విజయం సాధించారు. తాను పార్టీ సభ్యులతో సమీక్ష జరిపేందుకు రాజస్తాన్ వెళ్తున్నాను. తమ పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు” అని తెలిపారు. తమ పార్టీ బెంగాల్ లో గట్టి పోటీ ఇస్తుందని వివరించారు. అయితే బెంగాల్ లో ఎంఐఎం ఒంటరిగా వెళ్లడం కంటే మరో పార్టీతో పొత్తుపెట్టుకొని వెళ్తే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు అక్కడ ఉన్న లోకల్ పార్టీలతో ఒవైసి చర్చలు నడుపుతున్నారు.

దూసుకుపోతున్న ఒవైసి..అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నాం.