వివిధ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చిరుధాన్యాలు!

311
millet health benefits in telugu
millet

మానవుడు పండించిన మొదటి పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి. వీటిని తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం లేకుండా పండిస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. యాభైఏళ్లు పైబడిన వారు రోజూ ఒక‌టి లేదా రెండు పూట‌లు వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏయే అరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏయే చిరుధాన్యాల‌ను తింటే బాగుంటుందో తెలుసుకుందాం..

కొర్ర‌లు…
అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డేవారు కొర్ర‌ల‌ను అన్నంలాగ వండుకోవచ్చు.. అలాగే కొర్రల ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు.. దీని వలన త్వ‌ర‌గా బరువు తగ్గే అవకాశం ఉంది. కొర్రల అన్నం లేదా ఉప్మా తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దరిచేరవు. అంతేకాదు గుండె జ‌బ్బులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.

రాగులు…
వీటితో జావ‌, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది శ‌రీరానికి మంచి శక్తినిస్తుంది. రాగులు చ‌ల‌వ చేస్తాయి కాబట్టి ఎండ‌కాలంలో వీటిని తీసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ఉంటుంది. అలాగే శరీరంలో ర‌క్తం బాగా ఉత్పత్తి అవుతుంది.

సామ‌లు…
దీర్ఘకాలంగా తలనొప్పి, మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు సామ‌ల‌ను వండుకుని తినాలి.. ఇలా వారానికి ఒకసారైనా తింటే ఈ సమస్యలు దాదాపు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి శ‌రీరానికి మంచి పోషకాల‌ను అందిస్తాయి. ఇవి తినడం వలన ఎముక‌లు, న‌రాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్స‌ర్ రాదు. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉండటానికి సాములు బాగా ఉపయోగపడతాయి.

ఉల‌వ‌లు..
కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు ఈ ఉలవ‌లు ఎక్కువగా తినాలి. దాంతో రాళ్లు త్వరగా కరిగి మూత్రం రూపంలో బయటికి వస్తాయి.. అంతేకాదు వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి క్రమంగా పెరుగుతుంది.

ఆరికెలు…
డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అరికెల‌ను తినాలి. దీని వలన ఒంట్లో కొవ్వు పదార్ధాలు కరుగుతాయి.. బీపీ, షుగర్ వంటి సమస్యలు దరిచేరవు.. వీటి వ‌ల్ల కూడా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి గణనీయంగా పెరుగుతుంది. ఈ ధాన్యాలు తినడం వలన క్యాన్స‌ర్ సమస్య కూడా ఉండదట.

ఊద‌లు…
మ‌ల‌బ‌ద్ద‌కం, జీర్ణ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఊద‌ల‌ను ఎక్కువగా తింటే ఈ స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జొన్న‌లు…
జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

స‌జ్జ‌లు…
సజ్జల ద్వారా.. రొట్టె, అన్నం, అంబలి వంటివి చేసుకోవచ్చు.. అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తింటే ఫ‌లితం ఉంటుంది. వీటి వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.