Tamannah: వర్క్ ఔట్స్ లో కూడా ఓరచూపులేల మిల్కీ!

306

Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు దాటిపోయింది. కానీ ఏళ్ళు గడిచేకొద్దీ తమ్మూలో అందం పెరుగుతుందే కానీ తరగడం లేదు. బాడీ షేప్ లో అదే నాజూకు.. స్కిన్ గ్లోలో పాల తెలుపుతో కుర్రాళ్ళ నోళ్లు ఊరించేస్తుంది. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలు ఉండగా కొత్త ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు లైన్లో పెట్టేస్తుంది. ఇంత బిజీగా ఉన్నా జిమ్ లో వర్క్ ఔట్స్ మాత్రం ఆగడం లేదు. అదే తమ్మూ ఫిట్నెస్ రహస్యం కనుక జిమ్ లో చెమటోడ్చి ఆకృతిలో కత్తిలా మారిపోతుంది. ఊరికే కష్టపడితే ఎవరు చూస్తారనుకుందేమో ఆ ఫోటోలు తెచ్చి సోషల్ మీడియాలో మంట పెడుతుంది.

తాజాగా తమన్నా … తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోన్న ఫోటోను ఒక దాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మన శరీరాకృతి ఎలా ఉండాలో మన మైండ్ సెట్ చేస్తోంది. దానికి తగ్గట్టు కష్టపడితే అందమైన శరీరాకృతి మన వశం అవుతోంది అంటూ చెప్పుకొచ్చింది. తమ్మూ చెప్పిన వర్క్ ఔట్.. కొటేషన్ సంగతేమో కానీ ఆ చూపుల వేడి తమ గుండెల్లో గుచ్చేస్తుందని కుర్రకారు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు ఆ వర్క్ ఔట్స్ లో కూడా ఆ ఓరచూపులేంటి మేము ఉండాలా పోవాలా అంటూ మిల్కీ బ్యూటీని ప్రశ్నిస్తున్నారు.

వర్క్ ఔట్స్ లో కూడా ఓరచూపులేల మిల్కీ!