తక్కువ ధరకే అమ్ముడైన మైకేల్ జాక్సన్ ఎస్టేట్

52

మైకేల్ జాక్సన్, ప్రపంచం మెచ్చిన పాప్ స్టార్. ఆయన సాంగ్స్, డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కాగా మైకేల్ జాక్సన్ 2009లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ప్రస్తుతం ఆయనకు సంబందించిన పలు ఆస్తులను వేలం వేస్తున్నారు. ఈ తరుణంలోనే కాలిఫోర్నియాలో ఉన్న నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రాబ్ బర్క్లే కొనుగోలు చేశారు. సుమారు 2.2 కోట్ల డాలర్లుకు నెవర్‌ల్యాండ్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా దక్కువ ధర పలికినట్లు తెలుస్తుంది. 2700 ఎకరాలలో ఉన్న నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ ను అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దారు.

మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను సైకామోర్ వాలీ రాంచ్‌గా పేరు మార్చారు. మోంటానాకు చెందిన వ్యాపారవేత్త బర్క్లే జాక్సన్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలాన్ని మైకేల్ జాక్సన్ 1980 దశకంలో 20 మిలియన్ల డాలర్లకు ఖరీదు చేశాడు. 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ వ్యాపారవేత్త బర్క్లే కేవలం 22 మిలియన్ల డాలర్లకే సొంతం చేసుకున్నట్లు ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు.

అయితే మైఖేల్ మరణానికి ఏడాది ముందే ఆ ఎస్టేట్‌ను థామస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియన్ల డాలర్లకు సొంతం చేసుకున్నది. అయితే దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు. దింతో గతంలో ఉన్న ధరకు ఒక మిలియన్ డాలర్లు తగ్గించుకొని 22 మిలియన్లకు అమ్మేశారు. అయితే ఈ ఎస్టేట్ లో మైకేల్ బ్రతికి ఉన్న సమయంలో ఘరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. చిన్న పిల్లలపై అత్యాచారాలకు చేశారని మైకేల్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ ఎస్టేట్ ఇంత తక్కువ ధర పలికిందని అర్ధమవుతుంది.

తక్కువ ధరకే అమ్ముడైన మైకేల్ జాక్సన్ ఎస్టేట్