బీజేపీలోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్

254

మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఈ శ్రీధరన్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సురేంద్రన్‌ పిల్లై గురువారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన పార్టీలో చేరుతారని వివరించారు. త్వరలోనే జరుగనున్న ‘విజయ యాత్ర’ సందర్భంగా ఆయన లాంఛనంగా పార్టీలో చేరుతారని చెప్పారు. కాగా విజయ యాత్ర ఫిబ్రవరి 21న కాసరగోడ్‌లో ప్రారంభమై.. మార్చి మొదటి వారంలో తిరువనంతపురంలో ముగియనుంది. ఈ యాత్రను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు ముందుండి ఈ యాత్రను నడిపించనున్నారు.

కాగా 2011 డిసెంబర్‌ 21న ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్‌ పదవీ విరమణ చేశారు. దేశంలోని అనేక క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టులను శ్రీధరన్ డీల్ చేశారు. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌దే. కోల్ కతాలో మొదట నిర్మించిన మెట్రో రైలు రూపశిల్పి ఇతనే 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 92 చోట్ల, యూడీఎఫ్ 42 చోట్ల విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధిస్తుందని కాషాయ పార్టీ ఆశిస్తోంది.

బీజేపీలోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్