Teaser talk: గుణపాఠాలు చెప్పేందుకు వచ్చిన ‘ఆచార్య’!

358

Teaser talk: మెగా అభిమానులకు ఈ ఏడాదంతా పండగే. మెగా కుటుంబంలోని హీరోలవే మొత్తం 14 సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయంటే ఆ కోలాహలం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. మెగా అనే పదానికి ఆద్యుడైన చిరంజీవి ఈసారి ఆచార్యగా వస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో సిద్ధం కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ తో వాయిదాలు పడుతూ వచ్చింది. మొత్తంగా ముమ్మర షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ కు విడుదల చేసేందుకు యూనిట్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

అయితే.. ఈలోగా అభిమానులను సిద్ధం చేసేందుకు నేడు టీజర్ వదిలారు. శుక్రవారం టీజర్ విడుదల ఉంటుందని రెండు రోజుల క్రితమే ఒక వీడియోను విడుదల చేసిన యూనిట్ చెప్పిన విధంగా ఈరోజు టీజర్ విడుదల చేశారు. చిరు తనయుడు, ఈ సినిమాకి నిర్మాతైన రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ ఒక విజువల్ ట్రీట్ గా కనిపించింది. పాఠాలు చెప్పకపోయినా ఎందుకో ఆచార్య అంటుంటారని.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచలనాలను పెంచేసింది.

సహజంగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే సోషల్ ఎలిమెంట్ కథకు కమర్షియల్ హంగులు జోడించి తీర్చిద్దుతాడు. ఈ సినిమాలో కూడా అలాంటి అంశమే ఒకటి జోడించినట్లుగా టీజర్ లోనే తెలిసిపోతుంది. ఇతరుల కోసం జీవించే వాళ్ళు దైవంతో సమానమైతే.. వాళ్ళే ఇబ్బందులలో పడితే దైవమే దిగిరావాల్సిన పనిలేదని రామ్ చరణ్ చెప్పిన వాయిస్ ఓవర్ కథలో లీనమైన అంశాన్ని బయటపెడుతోంది. ఇక మణిశర్మ ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అంటూ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ను ఓ రేంజ్ లో తీసుకెళ్లింది. సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఇక వెయిటింగే!