‘ఎంసీఏ’ విద్య ఇకనుంచి రెండేళ్లే

75

మాస్టర్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సుపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు కాల పరిమితిని మూడేళ్ళ నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లుగా ఉండేది. అయితే ఏఐసీటీఈ తాజాగా ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రాలకు మార్గదర్శకాలిచ్చింది. దీంతో ఏఐసీటీఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ కోర్సులో చేరడానికి మేథమెటిక్స్‌ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు వర్సిటీలు రూపొందించిన ‘ప్రీరిక్విజైట్‌’ కోర్సులో ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది.