బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధారెడ్డి

233

హైదరాబాద్ నగర మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి ఈ ఎన్నికలపై పడింది. ఇప్పటికే అందరు కార్పొరేటర్లు కౌన్సిలర్ హల్ కు చేరుకున్నారు. కాగా ఇక్కడ కరోనా నిబంధనలు పాటించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పరీక్షలు కూడా చెయ్యకుండానే హాల్లోకి అనుమతించారు. ఇక వ్యక్తుల మధ్య దూరం కూడా కనిపించడం లేదు. మొత్తం 150 మంది కార్పొరేటర్లు 50 మందికిపైగా ఎక్స్ ఆఫీసియే సభ్యులతోపాటు, మరో 50 మంది వరకు అధికారులు ఉన్నారు.

మొదట 149 మంది కార్పొరేటర్లు ప్రమాణచేయనున్నారు స్వీకారం. కాగా లింగోజిగూడ కార్పొరేటర్ కరోనాతో మృతి చెందారు. ఇంకా ఇక్కడ ఉపఎన్నిక జరగలేదు. ఇక కార్పొరేట్ల ప్రమాణస్వీకారం అనంతరం నగర మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి, డిప్యూటీ మోతె శ్రీలత రెడ్డి ఉన్నారు. బీజేపీ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. ఆర్కే పురం కార్పొరేటర్ రాధ రెడ్డి మేయర్ గా, రవి చారి డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా ప్రకటించింది.