మాస్ మహారాజ రవితేజ సినిమా నుంచి పాట విడుదల

83

మాస్ మహారాజ రవితేజ, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా క్రాక్. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై బీ మధు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చింది.. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది.

కాగా ఈ చిత్రం నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు పాట విడుదల కానుంది. ‘బలేగా తగిలావే బంగారమా’ అంటూ ఈ పాట కొనసాగుతుంది. ఈ విషయాన్ని హీరో రివితేజ తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కాగా మాస్ మహారాజ అభిమానులు ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అనేది సినిమా రిలీస్ అయితేకాని తెలియదు.

మాస్ మహారాజ రవితేజ సినిమా నుంచి పాట విడుదల