ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుని విగ్రహం మన దగ్గరే!

10327

దేశంలో చాలా దేవాలయాల్లో శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటారు. కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం నిజరూప దర్శనం ఇస్తుంటారు. అలాంటి అతి కొద్దీ దేవాలయాల్లో ఒకటైన పాలరాతి శివుడి దేవాలయంలో మన తెలంగాణలోనే ఉంది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా పేరు పొందింది. ఇక్కడ ప్రతిరోజూ స్వామివారు పూజలు అందుకుంటారు. పాలరాతి శివుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఇక ఇక్కడ శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొంబర్రావుపేట శివాలయంలో మహాశివరాత్రిని పురష్కరించుకొని నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల 10న పుణ్యహవచనం, స్థాపిత దేవతల పూజలు, అభిషేకాలు, 11న స్వామివారి కల్యాణం, జాగారం, లింగోధ్భావం, 12న రథోత్సవం, అన్నదానం, 13న బద్దిపోచమ్మకు బోనాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుని విగ్రహం మన దగ్గరే!