ఎమ్మెల్యే దివాకర్ రావుకు లేఖరాసిన మావోయిస్టులు

347

టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యేకు మావోయిస్టులు షాక్ ఇచ్చారు. భూదందాలు, సెటిల్మెంట్లు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ మంచిర్యాల ప్రాంతంలో కలకలం సృష్టిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, అతడి తనయుడు కలిసి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాగా మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు.

గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఆ నిర్మాణం కారణంగా ముంపుకు గురైన ప్రజలకు ఇంతవరకు సాయం అందలేదని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు వాళ్ళను ఆదుకుంటానని హామీ ఇచ్చారని. కానీ ఇప్పటివరకు వారికీ అందాల్సిన సాయం అందలేదని తెలిపారు. ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని మావోయిస్టులు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల లేఖతో జిల్లాలో అలజడి మొదలైంది.. పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎమ్మెల్యే దివాకర్ రావుకు లేఖరాసిన మావోయిస్టులు