Manchu Manoj Marriage : రెండో పెళ్ళికి సిద్దమవుతున్న మంచు హీరో.

150

మంచు వారి ఇంట త్వరలో పెళ్లి వేడుక జరగనుంది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారు. మనోజ్ కోసం మోహన్ బాబు బంధువుల అమ్మాయిని చూసినట్లుగా తెలుస్తుంది. మే నెలలో వీరి వివాహం జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా మనోజ్ కి 2015 లో తన ప్రియురాలు ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి వరస సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు మనోజ్, ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న అంశాలపై సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉంటారు. మొదటి భార్యతో వీడిపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాత ప్రణతి అమెరికా వెళ్లడం.. అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండిపోయిందని.. ఇక్కడే మనోజ్, ప్రణతి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

Manchu Manoj Marriage : పెళ్ళికి సిద్దమవుతున్న మంచు మనోజ్