రికార్డ్ సృష్టించిన మంచు లక్ష్మి కుమార్తె, నోబెల్ బుక్ లో స్థానం

92

మంచు లక్ష్మి కుమార్తె విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘటన సాధించింది. ఆరేండ్ల వయసులో యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా నోబెల్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. కాగా నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అర్హత సాధించి ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నది.

ఇక ఈ విషయంపై మంచు లక్ష్మి మాట్లాడుతూ, నిర్వాణ ఈ ఘనత సాధించడం ఓ తల్లిగా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిన్న వయసులో ఈ ఘనత సాధించడం చాలా గొప్ప అని వివరించారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. వయసులో ఈ నోబెల్ బుక్ అఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాతగా ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టం ఉంటే అది చేయించాలని తెలిపారు.

వారికీ ఇంటరెస్ట్ ఉన్న వాటిని తల్లిదండ్రలు నేర్పిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని తెలిపారు మోహన్ బాబు. ఇక ఈ రికార్డ్ సాధించిన నిర్వాణను పలువురు ప్రసంశించారు.

రికార్డ్ సృష్టించిన మంచు లక్ష్మి కుమార్తె, నోబెల్ బుక్ లో స్థానం