లైసెన్స్ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తికీ జైలు శిక్ష

289

లైసెన్స్ లేనిదే వాహనం నడపరాదని పోలీసులు పదే పదే చెబుతున్నారు.. లైసెన్స్ లేకుండా దొరికిన వారిని జైలుకు పంపుతున్నారు. అయితే లైసెన్స్ లేని యువతికి బైక్ ఇచ్చిన యువకుడిని జైలుకు పంపారు.. ఈ ఘటన హైదరాబాద్ లోనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి హోసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 20 రాత్రి హైదర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీడీఎస్ విద్యార్థిని ఆది రేష్మ (20) మృతి చెందింది. మియాపూర్ లో సినిమా చూసి వస్తుండగా తన స్నేహితుడు అజయ్ సింగ్ స్కూటీపై ఇంటికి బయలుదేరింది.

రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది. కొద్దీ దూరం నడిపిన అనంతరం వాహనం బ్యాలెన్స్ తప్పడంతో ఇసుక లారీకిందకు దూసుకెళ్లింది. దింతో రేష్మ అక్కడికక్కడే మృతి చెందింది. వాస్తవానికి రేష్మకి బండి నడపడం రాదు.. ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. కానీ అజయ్ అవేవి తెలియకుండా ఆమెకు స్కూటీ ఇచ్చాడు. దింతో అజయ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు తీర్పుతో అతడిని రిమాండ్ కు తరలించారు. ఇక లారీ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లైసెన్స్ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తికీ జైలు శిక్ష