సరిగ్గా ఖననానికి ముందు పాడెపై నుంచి లేచాడు!

55

మనిషి చనిపోయాడని ధ్రువీకరించి ఖననం తర్వాత కూడా లేచి వచ్చిన సంఘటనలు గతంలో వినే ఉంటారు. ఇటువంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలుమార్లు జరిగాయి. సోమవారం ఇటువంటిదే మరో సంఘటన వెలుగుచూసింది, కానీ ఖననానికి ముందే పాడెపై లేచి కూర్చున్నాడు.. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కట్టుబావి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

కట్టుబావి గ్రామంలో చెట్టుకింద రెండు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని గమనించిన గ్రామస్తులు గ్రామా కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు సమాచారం అందించారు. దింతో వారు అక్కడికి చేరుకొని అతడు మృతి చెందినట్లుగా భావించి పాడెపై పడుకోబెట్టారు. ఖననం చేసేందుకు గుంతవద్దకు తీసుకెళ్తుండగా పాడే మీద లేచి కూర్చున్నాడు.

వెంటనే కిందకు దింపి 108కి ఫోన్ చేసి అంబులెన్స్ సాయంతో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించడంతో కోలుకున్నాడు. అయితే అతని వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

సరిగ్గా ఖననానికి ముందు పాడెపై నుంచి లేచాడు!