వీడు మనిషి కాదు.. మృగం

177

సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మైసూరులో ఓ యువకుడు వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమశేఖర్ అనే వ్యక్తి మైసూరులోని గోకులం 3వ వార్డులో ఈ ఘటన జరిగింది. సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్‌ ఫర్‌ అనిమల్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.

వీడు మనిషి కాదు.. మృగం