ఊహించని ప్రకటన చేసిన మమతా బెనర్జీ

441

పశ్చిమ బెంగాల్ లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దింతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అధికార టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మూడోసారికూడా అధికారం చేజిక్కించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 294 అసెంబ్లీ సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్ లో 148 స్థానాల్లో విజయం సాధించిన వారు అధికారం చేపడతారు.

కాగా 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ 214 సీట్లలో గెలిచి అఖండ విజయం అందుకుంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఇక బీజేపీ కాంగ్రెస్ చెరో 23 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ సారి ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మమతను ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తృణమూల్ లో ఉన్న అసంతృప్తి నేతలను బీజేపీలో చేర్చుకుంటుంది. ఇప్పటికే సుమారు 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఇది ఇలా ఉండగా సీఎం మమతా బెనర్జీ సోమవారం సంచలన ప్రకటన చేసింది. తాను వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. కాగా ఈ నియోజకవర్గం తాజాగా బీజేపీలో చేరిన తృణమూల్ కీలక నేత సువెందు అధికారిది. కమ్యూనిస్ట్ కోతలను బద్దలు కొట్టి సువెందు అధికారి ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈ మద్యే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దింతో మమతా ఇక్కడినుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

తనను కాదని వెళ్లిన సువెందు అధికారిని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు మమతా. కాగా నందిగ్రామ్ నియోజకవర్గానికి మంచి పేరు ఉంది. ఇది మమతకు కలిసివచ్చే నియోజకవర్గం. 2007 ఆమె ఇక్కడే ఉద్యమం చేశారు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం నందిగ్రామ్ లో ఏర్పాటు చేయడానికి పూనుకున్న sez ను ఆమె అడ్డుకున్నారు. దీనికోసం తీవ్రంగా పోరాడారు. ఈ పోరాటమే 2011 లో మమతను అధికారంలోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో నందిగ్రామ్ కమ్యూనిస్టుల చేతిలోంచి తృణముల్ చేతిలోకి వెళ్ళింది. రెండు దఫాలుగా సువెందు అధికారి అక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే మమతా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటన చేయడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. దాంతోపాటు కోల్ కతాలోని భభిన్ పూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తా అని ఆమె తెలిపారు. అయితే నందిగ్రామ్ ప్రాంతంలో తృణమూల్ కు పట్టున్నప్రాంతం అయితే ఆ పట్టు సువెందు అధికారి వల్లనే వచ్చిందనేది పార్టీ నుంచి బయటకు వచ్చినవారి వాదన, సువెందు అధికారి 70 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇకవేళ దీదీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తే రాజకీయాలు రసవత్తరంగా మారె అవకాశం ఉంటుంది.

ఊహించని ప్రకటన చేసిన మమతా బెనర్జీ