మమతకు మరో ఎదురుదెబ్బ : కీలక మంత్రి గుడ్‌బై

147

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీబ్ బెనర్జీ శుక్రవారం అటవీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ పంపారు. కాగా రాజీబ్ బెనర్జీ హౌరా జిల్లా డోమ్జూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. అనంతరం ప్రభుత్వంలో అటవీ మంత్రిగా ఎంపికయ్యారు. అయితే గతకొంతకాలంగా ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న రాజీబ్ బెనర్జీ తాజాగా క్యాబినెట్ నుంచి వైదొలిగారు.

‘కేబినెట్ మంత్రిగా అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున నా పదవికి రాజీనామా చేసినట్లు మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను’ అని రాజీబ్ బెనర్జీ సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేయడం చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం లభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి’ అంటూ సీఎంను కోరారు.