టిఎంసిలో చేరిన బీజేపీ ఎంపీ సతీమణి.. విడాకులు ఇస్తానని భర్త హెచ్చరిక

96

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు తీవ్రమయ్యాయి. సోమవారం, బిజెపి ఎంపి సౌమిత్రా ఖాన్ భార్య సుజాత మొండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. టిఎంసి సీనియర్ లీడర్, ఎంపి సౌతా రాయ్ సమక్షంలో సుజాతా ఆ పార్టీలో చేరారు. దీంతో సుజాతకు ఆమె భర్త విడాకుల నోటీసు పంపిస్తానని హెచ్చరించారు. అయితే తాను బిజెపి మురికి రాజకీయాల వల్లే తృణమూల్‌లో చేరానని చెప్పారు. బీజేపీ పెద్దలు తృణమూల్ కాంగ్రెస్ నాయకులను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.

బిజెపిలో ఉన్నవారిని గౌరవించడం లేదని కూడా అన్నారు. మమతా బెనర్జీ మాత్రమే పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లగలరని. రాష్ట్రాన్ని విభజించే రాజకీయాల నుండి మమతా మాత్రమే రక్షించగలదని, అందువల్ల దీదీతో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. కాగా ఆమె భర్త సౌమిత్రా ఖాన్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.