మమతా బెనర్జీ సహాయకుడు మృతి

132

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహాయకుడు మణిక్ మజుందార్ కన్నుమూశారు. గత కొద్దీ రోజులక్రితం మణిక్ కరోనా బారినపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కాగా మణిక్ నాలుగు దశాబ్దాలుగా మమతా బెనర్జీకి సహాయకుడిగా ఉన్నారు కలిసి ఉన్నారు. అత్యంత నమ్మకస్తుడు కూడా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు నుంచే ఆయన బెనర్జీ సహాయకుడిగా ఉన్నారు. తన సన్నిహిత సహాయకుడు మృతి పట్ల మమతాబెనర్జీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

”నాలుగు దశాబ్దాలుగా నాతో కలిసి పనిచేసిన మజుందార్ ను కోల్పోవడం నాకెంతో బాధ కలిగించింది. కాళీఘాట్ లోని నా కార్యాలయంలో మజుందార్ ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారని తెలిపారు మమతా. నిబద్దత గల వ్యక్తి మంజుదార్ అని తెలిపారు మమతా. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దగ్గరి సహాయకుడైన మణిక్ మజుందార్ మరణించడం మమతాబెనర్జీకి దిగ్బ్రాంతి కలిగించింది.