మమతకు స్కూటీ కష్టాలు

171

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఎలెక్ట్రిక్ స్కూటీపై ప్రయాణం చేస్తూ నిరసన తెలిపారు. మొదట మమతా స్కూటీ నడిపేందుకు ప్రయత్నించి కిందపడేంత పనిచేశారు. సెక్యూరిటీ సిబంది పట్టుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ తరువాత కోల్ కతా మేయర్ బండి నడపగా ఆమె సచివాలయం ప్రాంతం నుంచి కాళీఘాట్ కు వెళ్లారు. మమత స్కూటీ నేర్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇదిలా ఉంటే బెంగాల్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది… ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటతో ప్రధాన పార్టీలు ర్యాలీలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. తృణమూల్ ను ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తుండగా, మూడోసారి ఎలాగైనా తామే విజయం సాధించాలని తృణమూల్ గట్టిగ ప్రయత్నిస్తుంది. ఇక బెంగాల్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసి పార్టీ ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు.

మమతకు స్కూటీ కష్టాలు