గులాం నబీ ఆజాద్ స్థానంలో మల్లికార్జున్ ఖర్గేకు ఛాన్స్?

150

గులాం నబీ ఆజాద్ స్థానంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులవుతారని వార్తా సంస్థ పిటిఐకి వర్గాలు తెలిపాయి. ఆజాద్ పదవీ విరమణ తరువాత ప్రతిపక్ష నాయకుడు పదవికి ఖార్గేను నియమించాలని కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు లేఖ రాసిందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి ఆజాద్, జూన్ 8, 2014 నుండి ఆరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ..

ఈ ఫిబ్రవరి 15న ఎగువ సభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రస్తుతం అసెంబ్లీ లేదన్న విషయం తెలిసిందే.. 2019 ఆగస్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో జమ్మూకాశ్మీర్ కేంద్ర భూభాగంలో అంతర్భాగమైంది. కాగా కర్ణాటకకు చెందిన దళిత నాయకుడైన ఖార్గే 2014 నుండి 2019 వరకు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్నారు.