రాముడిగా మహేష్.. రావణుడిగా హృతిక్.. ఇది ఫైనల్?

149

ఏదో సినిమా తీసుకున్నాం.. మన భాషలో రిలీజ్ చేసి మంచి సినిమా అనిపించుకున్నాం. నిర్మాతకు, డిస్టిబ్యూటర్లకు పైసలు వచ్చాయా.. దర్శకుడికి పేరొచ్చిందా అంతే అన్నట్లుగా ఉండేది మొన్నటి వరకు మన సినిమాల పరిస్థితి. మహా అయితే బాలీవుడ్ హిందీ సినిమాలు డబ్బింగ్ రూపంలో దేశంలో ఇతర బాషలలో రిలీజైతే కొన్ని సక్సెస్ అయ్యేది. ప్రాంతీయ బాషల సినిమాలు మాత్రం నేషనల్ లెవల్ లో రిలీజ్ అవడం అంటే చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు, తమిళం, కన్నడ బాషా ఏదైనా మన సినిమా ఇప్పుడు ఇండియాలోనే కాదు.. దేశవిదేశాలలో కూడా రిలీజ్ కావాల్సిందే.

ఒక రోబో, బాహుబలి, కేజీఎఫ్ ఇలా దక్షణాది సినిమాలు కూడా బాలీవుడ్ రేంజ్ దాటేసి హిందీవాళ్ళకి కూడా చుక్కలు చూపించేశాయి. దీంతో ఇప్పుడు అక్కడ నిర్మాణ సంస్థలు, నటులు కూడా మన సినిమాలకు ఒకే చెప్పేసి దూకేస్తున్నారు. ఇదే అదనుగా మన వాళ్ళు భారీ పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్-2, సలార్, లైగర్, ఆదిపురుష్ ఇలా వరసపెట్టి దక్షణాది సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఇదే వరసలో మరో భారీ, క్రేజీ ప్రాజెక్ట్ కూడా సిద్ధమవుతుందని టాక్.

ఇప్పటికే ప్రభాస్ రాముడిగా తెలుగు, హిందీ బాషల నటులతో కూడిన సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఇది భారీ బడ్జెట్ సినిమా. కాగా ఆ మధ్య నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో రామాయణ గాధను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి నితీశ్ తివారీ, రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాలో రాముడిగా మ‌హేష్ బాబు, రావ‌ణుడిగా హృతిక్ రోష‌న్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం.

2022లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుద‌ల కానుందని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కాగా ప్రభాస్ ఆదిపురుష్ కూడా రామాయణ గాధను బేస్ చేసుకొనే తెరకెక్కించే సినిమా కాగా మహేష్-హృతిక్ సినిమా కూడా రామాయణాన్ని బేస్ చేసుకున్న కథే. రెండు సినిమాలలో కూడా భారీ తారాగణంతో పాటు వందల కోట్లలోనే బడ్జెట్. దీంతో ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు ఆసక్తికరంగా మారాయి.

రాముడిగా మహేష్.. రావణుడిగా హృతిక్.. ఇది ఫైనల్?