Mahatma Gandhi : గాంధీ వర్ధంతి రోజు విగ్రహం ధ్వంసం

1807

Mahatma Gandhi : గాంధీ వర్ధంతి రోజు విగ్రహం ధ్వంసం

గాంధీ వర్థంతి రోజే ఆయన విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. ఆరడుగుల ఎత్తు, 294 కేజీల బరువైన కాంస్య విగ్రహాన్ని ఉత్తర కాలిఫోర్నియాలో నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేశారు. గాంధీ విగ్రహాన్ని భారత్, అమెరికాకు బహుమతిగా పంపింది. శాంతి మంత్రంతో స్వతంత్ర పోరాటం చేసిన గాంధీ, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. అటువంటి శాంతి దూత విగ్రహాన్ని కూల్చడంతో ఇండో – అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంపై విచారణ కోరేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లిందని భారత్‌ పేర్కొంది. అయితే గతేడాది కూడా ఇటువంటి ఘటనే జరిగింది. అప్పట్లో ఖలిస్థాన్ ఏర్పాటు వాదులు గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు.