మధ్యప్రదేశ్‌లో లవ్ జిహాద్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

53

మధ్యప్రదేశ్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదిత బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును డిసెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. శనివారం సిఎం శివరాజ్ సింగ్ చౌహన్ నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముసాయిదాను ఆమోదించారు. ఈ చట్టాన్ని మరింత కఠినంగా మార్చాలని నిర్ణయించారు. అంతకుముందు హోంమంత్రి నరోత్తం మిశ్రా కూడా చట్టాన్ని కఠినతరం చేయాలని వ్యాఖ్యానించారు..

ఇక ఈ చట్టంలో పొందుపరిచిన నియమాలు ఇలా ఉన్నాయి..

*బలవంతంగా మతమార్పిడి చేయడం మరియు వివాహం చేసుకోవడం వంటి వాటికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తోపాటు.. 10 సంవత్సరాల శిక్ష పడనుంది.

*మత మార్పిడి చేసి వివాహం చేసుకోవాలి అంటుకుంటే.. వారు రెండు నెలల ముందు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖితపూర్వకంగా ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

*దరఖాస్తు చేయకుండా మతమార్పిడి చేసిన మత పెద్దలు, ఖాజీ, మౌల్వి లేదా మతాధికారులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది.

*మతమార్పిడి మరియు బలవంతపు వివాహం గురించి బాధితులు, తల్లిదండ్రులు, కుటుంబం లేదా సంరక్షకులలో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

*మతమార్పిడి మరియు బలవంతపు వివాహానికి సహకరించే వారిని కూడా ప్రధాన నిందితులుగా చేరుస్తారు. వారిని నేరస్థులుగా తీసుకుంటే ప్రధాన నిందితుల మాదిరిగానే శిక్ష అనుభవిస్తారు.