Madhurima: పెద్ద పాపకేమో డ్రెస్ కాస్త చిన్నదాయెరో!

242

Madhurima: పెద్ద పాపకేమో డ్రెస్ కాస్త చిన్నదాయేరో.. ఈ పాపని చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది మరి. మధురిమ అందానికి ఏ మాత్రం తక్కువలేదు. కాకపోతే అడివి కాచిన వెన్నెల అయిపోతుందన్నదే బాధంతా. నటన, గ్లామర్ లో మధురిమకి మంచి మార్కులే పడతాయి. సిల్వర్ స్క్రీన్ మీద.. సినీ ఇండస్ట్రీలో వెలిగిపోవాలంటే అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కావాలంటారు. బహుశా ఆ అదృష్టమే లేదేమో ఈ చిన్నదానికి. ఏవేవో అవకాశాలు దక్కినా పెద్దగా పైకి వచ్చేంత హిట్స్ దక్కలేదు.

 Madhurima: బుడ్డి నెక్కరులో సముద్రపు ఒడ్డున రెచ్చిపోయిన రామ్ చరణ్ భామ.. Photo : Instagram

మధురిమ పెద్ద వంశీ లాంటి దర్శకుల చేతిలో పడినా కెరీర్ మాత్రం స్పీడ్ అందుకోలేదు. బహుశా అదృష్టం లేకనేమో అని అమ్మడికి కూడా అర్ధమై పేర్లు కూడా మార్చుకుంది. ముందు మధురిమ పేరుకు బెనర్జీ అనే తోక తగిలించినా లక్ కలిసిరాలేదు. దీంతో ఏకంగా నైరా బెనర్జీగా మార్చేసుకుంది. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేది. ఇక ఇప్పుడు కాస్త స్లిమ్ కూడా అయింది. ఆ విషయం అందరికీ తెలియాలి కదా మరి. అందుకే ఇలా దుకాణం ఓపెన్ చేసింది. పొట్టి నిక్కర్ వేసుకొని బీచ్ లో అలా అలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

 మధురిమ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో హీరో ఫ్రెండ్ ఫాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ భామకు ఇంతవరకు హిట్ సినిమా పడలేదు. దీంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. Photo : Instagram

సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను బయటపెట్టేసి నెట్టింట మంట పెట్టేసింది. దీంతో చిన్నదాని సోయగాలు చూసిన పురుష పుంగవులు ఏం తక్కువని అవకాశాలు ఇవ్వడం లేదో అని తెగ ఫీలైపోతున్నారు. ఈసారి నైరా బేబీకి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ చిన్నదాని అందాలకు దాసోహమైన అభిమానులు సోషల్ మీడియాలోనే సినీ మేకర్స్ కు రికమెండ్ చేస్తున్నారు. అవకాశం ఎలాగోలా వస్తుంది కానీ ఈసారైనా పిసిరంత అదృష్టం కలిసి వస్తుందా అన్నదే చూడాలి మరి!

 Madhurima: బుడ్డి నెక్కరులో సముద్రపు ఒడ్డున రెచ్చిపోయిన రామ్ చరణ్ భామ.. Photo : Instagram

పెద్ద పాపకేమో డ్రెస్ కాస్త చిన్నదాయేరో!