Madanapalle Case : జైల్లో పద్మజ దెబ్బకు వణికిపోతున్న ఖైదీలు, రాత్రిళ్లు నిద్రపోవడం లేదట

73

చిత్తూరు జిల్లా మదనపల్లె హత్యకేసు నిందితులను మదనపల్లె సబ్ జైల్లో ఉంచి విషయం విదితమే, అయితే వారు జైల్లో రాత్రి సమయంలో నిద్రపోకుండా తోటి ఖైదీలను భయానికి గురిచేస్తున్నారంట. పద్మజ శివ.. శివ. అంటూ గట్టిగ అరుస్తున్నారట, ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది…. శివుడు వస్తున్నాడు కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభం కానుంది అని గట్టిగ మొత్తుకుంటుదట. నన్నే లోపలేస్తారా నేను ఎవరిని అనుకుంటున్నారు అని పెద్దగా కేకలు వేస్తున్నట్లు జైలు సూపరిండెంట్ తెలిపారు. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఆమె చేష్టలకు బ్యారక్ లో ఉన్న వారు నిద్రించాలి అంటే భయపడుతున్నారన్నారు.

పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారట. పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని నమస్కారాలు చేసుకుంటున్నారట. ఒక్కోసారి ఏడుస్తున్నారని సూపరిండెంట్ తెలిపారు. పద్మజ, పురుషోత్తంలను మెరుగైన చికిత్స కోసం దంపతులను విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించారు. బందోబస్తు సమస్య రావడంతో వారిని అక్కడే ఉంచారు. జైల్లో వారి ప్రవర్తన సరిగా లేదని జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సూపరిండెంట్ సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. అధికారులు వెంటనే విశాఖకు తరలించేందుకు బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని కోరినట్లుగా జైలు సూపరిండెంట్ మీడియాకు తెలిపారు.

Madanapalle Case : జైల్లో పద్మజ దెబ్బకు వణికిపోతున్న ఖైదీలు, రాత్రిళ్లు నిద్రపోవడం లేదట