టీచర్ ని పెళ్లాడిన ప్రపంచ సంపన్నురాలు

1792

ప్రపంచ మహిళా ధనవంతుల్లో ఒకరైన మెకాంజీ స్కాట్ రెండో వివాహం చేసుకున్నారు. సీటెల్‌కు చెందిన టీచర్‌ డాన్‌ జెవెట్‌ను ఆమె పెళ్లాడారు. ఈ విషయాన్ని అమెరికా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అదే విధంగా జెవెట్‌ సైతం మెకాంజీకి సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా ధ్రువీకరించారు. ‘‘అత్యంత దయనీయురాలు, కరుణామూర్తి అయిన మహిళను నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు, సంపద దానం చేసే విషయంలో తను ఎంతో నిబద్ధతగా నెరవేరుస్తున్న బాధ్యతల్లో భాగం కాబోతున్నాను’’ అంటూ తాను ఆనందంలో మునిగిపోతున్నట్లు తెలిపారు.

మెకాంజీ స్కాట్‌, ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య.. గతేడాది వీరికి విడాకులు కాగా.. ఈ ఏడాది మార్చిలో మరో పెళ్లి చేసుకున్నారు. తన మొదటి భార్య పెళ్లిపై, జెఫ్‌ బెజోస్ స్పందించారు. ‘‘డాన్‌ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

టీచర్ ని పెళ్లాడిన ప్రపంచ సంపన్నురాలు