షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు లక్కీ ఛాన్స్.. లక్ష ప్రైజ్ మనీ మీ సొంతం..

449

మీరు కథలు బాగా రాస్తారా, మీరు బాగా నటిస్తారా, మీరు బాగా దర్శకత్వం వహిస్తారా, షార్ట్ ఫిలిమ్స్ బాగా తీయగలరా?? అయితే ఈ అవకాశం మీ కోసమే. యువతలోని నైపుణ్యాన్ని బయటకి తేవాలనే తపనతో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖలతో కలిసి రెండు సంస్థలు ఈ కాంటెస్టును నిర్వహిస్తున్నాయి. కరోనా తర్వాత మొట్ట మొదటి అతి పెద్ద షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఇదే కాగా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనచ్చు. తెలుగు భాషలో తమ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి [email protected]కి పంపించొచ్చు. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో మొత్తం లక్ష రూపాయల బహుమతిని నిర్వాహకులు ప్రకటించారు. బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ కి మొదటి బహుమతి 50000 రూపాయలు, రెండో బహుమతి 20000 రూపాయలు, మూడో బహుమతి 10000 రూపాయలు, మరియు నాలుగు స్పెషల్ బహుమతులు 5000 రూపాయలు ప్రకటించారు.

అంతే కాకుండా 15 రకాల కేటగిరీల్లో బెస్ట్ అవార్డులు అందించనున్నారు. అంతే కాక పార్టిసిపేట్ చేసిన ప్రతివారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మరియు మెమెంటో కూడా అందజేస్తారు. కాంటెస్ట్ లో వచ్చిన బెస్ట్ 25 షార్ట్ ఫిలిమ్స్ ని రవీంద్ర భారతిలో కూడా ప్రదర్శిస్తారు. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ప్రముఖ టీవీ, సినిమా నటులు లోహిత్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బ్రిహస్పతి టెక్నాలజీస్ అధినేత పాపోలు రాజశేఖర్ జడ్జెస్ గా ఉండబోతున్నారు.

మీ షార్ట్ ఫిలిమ్స్ ని సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ 25 ఫిబ్రవరి 2021, బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ మార్చ్ 9న రవీంద్ర భారతి లో ప్రదర్శిస్తారు. అవార్డ్స్ ని మార్చ్ పదో తేదీన రవీంద్ర భారతిలోనే అందించనున్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై అవార్డులు అందించనున్నారు. మరిన్ని వివరాల కోసం 6300499999 , 8790039025కి కాల్ చేయాలని నిర్వాహకులు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ సృజనాత్మకతకు పదును పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి క్యాష్ ప్రైజ్ తో పాటు మీ కలలను సాకారం చేసుకొనేందుకు ఇదొక అవకాశం మలచుకోండి!

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు లక్కీ ఛాన్స్.. లక్ష ప్రైజ్ మనీ మీ సొంతం..