పెళ్ళికి ఒప్పుకొని పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య..

85

పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువులో చోటుచేసుకుంది. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్ (21) ఓ యువతి గత కొంత కాలం ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయంలో ఇంట్లో పెద్దలకు చెప్పారు. తమకు పెళ్లి చెయ్యాలని కోరారు. అయితే ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.

గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరు ఇంట్లోంచి వెళ్లి మొద్దులచెరువు స్టేజి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.