Prakasham News : ప్రేమ జంట ఆత్మహత్య

224

ప్రేమజంటల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమ మోజులో పడి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు విడుస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. గడిచిన మూడు నెలల కాలంలో 20 జంటలకు పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఆంధ్ర, తెలంగాణలో ప్రేమికుల ఆత్మహత్యలు పరిపాటిగా మారిపోయింది. తల్లిదండ్రులు మందలించినా, ప్రేమకు అడ్డు చెప్పినా వారికీ ముందు ఆత్మహత్యే గుర్తుకు వస్తుంది. బంగారు జీవితాన్ని ప్రేమ అనే మత్తులోకి దింపి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు.

కాగా ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య అందరిని కలచివేసింది. జిల్లాలోని వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ దగ్గర రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు దేశాయిపేటకు చెందిన సాయి సతీష్(20), షకీనా(18)గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరుకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంత చిన్న వయసులో ప్రేమలో పడి జీవం విడిచిన వీరి శరీరాలను చూసు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు రైలు పట్టాలపై విగత జీవిగా పడిఉండటంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు చుట్టుపక్కల వారిని కన్నీరు పెట్టిస్తున్నాయి.

Prakasham News : ప్రేమ జంట ఆత్మహత్య