Lovers Suicide : మరో ప్రేమజంట ఆత్మహత్య

61

ప్రేమ జంటల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో రైతుల ఆత్మహత్యలు చూసి బాధపడేవారం.. కానీ ఇప్పుడు ప్రేమికుల ఆత్మహత్యలు చూసి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు ప్రేమ జంటలు బలవన్మరణాలకు పాల్పడుతున్నాయి. ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమజంట జీవం తీసుకుంది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో దిగిన ప్రేమజంట ఒకే తాడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రేమవ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా పడారుపల్లిలో జరిగిందీ ఘటన. యువతీయువకులను చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీశ్, లావణ్యగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Lovers Suicide : మరో ప్రేమజంట ఆత్మహత్య