ప్రేమ జంట బలవన్మరణం

166

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ జంటల ఆత్మహత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోదాడ పెద్ద చెరువులో దూకి యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఇంట్లోంచి వెళ్ళిపోయిన యువతి యువకుడు శుక్రవారం చెరువులో శవాలై తేలారు. శుక్రవారం ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ జంట బలవన్మరణం