ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు.

231

UP Lovers Suicide : ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది.. బరేలి జిల్లా మీర్ గంజ్ ప్రాంతంలో ఓ ప్రేమ జంటను యువతి తరపు వారు అత్యంత కిరాతకంగా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. వివరాల్లోకి వెళ్తే మీర్ గంజ్ ఏరియాకు చెందిన 19 ఏండ్ల యువకుడు, 17 ఏళ్ల బాలిక గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు గమనించారు. దాంతో వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.

కాగా ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఈ హత్యలో నలుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. బాలిక సోదరుడు మామను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వారికోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలిసీతెలియని పిల్లను హత్యచేశారని, హత్యతో సంబంధం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు.