అమ్మాయికి 22 అబ్బాయికి 17

56

గత కొద్దీ రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ జంటలు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్టోబర్ నుంచి నేటివరకు పదికి పైగా జంటలకు పైగా బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడమే అని తెలుస్తుంది. ఇంకో విషయం ఆత్మహత్య చేసుకున్న జంటల్లో 16 నుంచి 24 ఏళ్ల మధ్యకాలవారే ఉన్నారు. అయితే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేదంటే ఒకరిని చూసి మరొకరు ఇలా చేస్తున్నారా అనేది అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా కన్నవారికి మాత్రం పుట్టెడు శోకం మిగిల్చి వెళ్తున్నారు.

కాగా బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజతండ పంచాయితీ వడ్లతండకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. భూక్య ప్రవీణ (22) వెంకటేష్ (17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వయసులో వెంకటేష్ కంటే భూక్యా ప్రవీణ పెద్ద కావడంతో ఇంట్లో వారు పెళ్ళికి ఒప్పుకోరని ఇరువురు నిర్ధారించుకున్నారు. చావే తమ సమస్యకు పరిష్కారం అని భావించారు. మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి బుధవారం ఉదయం తండాకు సమీపంలోని బావిలో శవాలుగా తేలారు. మూడు రోజులుగా ఇద్దరు కనిపించకపోవడంతో ఏటో వెళ్లి ఉంటారని అందరు అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే వ్యవసాయ బావి యజమాని పొలం దగ్గరకు వెళ్లి బావిలో చూడగా రెండు మృతదేహాలు కనిపించాయి. దింతో గ్రామస్తులకు సమాచారం అందించారు. బావి దగ్గరకు చేరుకున్న కుటుంబ సభ్యులు లబోదిబో అంటూ విలపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అమ్మాయికి 22 అబ్బాయికి 17