వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య

273

Tamilnadu lovers : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని సేలం సమీపంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే పెట్రోల్ పంప్ లో పనిచేసే శేఖర్ (26) కు, గోమతి (30) అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. దింతో వీరిద్దరూ గత కొంతకాలంగా ఎవరికీ తెలియకుండా కలిసేవారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నారు. వెళ్ళిపోతే పరువుపోతుందని భావించి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు చెరువులోంచి మృతదేహాలను వెలికితీశారు.

ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యే అని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. శేఖర్ స్వస్థలం సేలం జిల్లా, మకుటంజావడి సమీపంగల కూడలూరు గ్రామం కాగా, గోమతిడి నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు, గోమతి భర్త పేరు గోపాల్ గా తెలుస్తుంది. ఇక శేఖర్ కు గతంలోనే సుమతి మనే మహిళతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెట్రోల్ బ్యాంకులో పనిచేస్తున్న సమయంలోనే శేఖర్, గోమతికి మధ్య సంబంధం ఏర్పడింది.

వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య