నిజామాబాద్ జిల్లాలో ప్రేమికులు బలవన్మరణం

192

ప్రేమికుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసీతెలియని వయసులో ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో పదుల సంఖ్యలో ప్రేమ జంటలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిని చూస్తుంటే ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో వైపు అమ్మాయిలపై దాడులు కూడా పెరిగిపోయాయి.ప్రేమించడం లేదని దాడి చేసి ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు మృగాలు.

ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కుదావంద్ పూర్ గ్రామానికి చెందిన సుకన్య (21) ఐలాపురానికి చెందిన ప్రేమ్ (22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య పెళ్లి విషయంపై ఫోన్ లో చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య అబిప్రాయభేదం యువతి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియడంతో ప్రియుడు ప్రేమ్ ఐలాపురంలోని చెరువుదగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నిజామాబాద్ జిల్లాలో ప్రేమికులు బలవన్మరణం