లవ్ జిహాద్ నిజమే – మెట్రోమ్యాన్ శ్రీధరన్

343

లవ్ జిహాద్ విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చట్టాలు కూడా తెచ్చాయి. ఇక లవ్ జిహాద్ కేసులో కేరళలో అధికంగా ఉన్నట్లుగా పలు సర్వేలలో తేలింది. ఇదిలా ఉంటే లవ్ జిహాద్ పై మెట్రోమ్యాన్ శ్రీధరన్ స్పందించారు. కేరళలో లవ్ జిహాద్ ఉంది నిజమే అని తెలిపారు. శుక్రవారం ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీధరన్ పలు అంశాలను ప్రస్తావించారు. హిందూ యువతులకు వల వేసి వారిని పెళ్లి చేసుకొని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు.

మొదట మాయమాటలు చెప్పి తల్లిదండ్రుల మాట వినకుండా చేసి ఆ తర్వాత యువతులను పెళ్లి చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. లవ్ జిహాద్ కు హిందూ అమ్మాయిలు బలవుతున్నారని తెలిపారు. క్రైస్తవ యువతులను కూడా లవ్ జిహాద్ ఊబిలో దింపుతున్నారని మెట్రోమ్యాన్ వివరించారు. కాగా ఇయ్యన త్వరలో బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు తానూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేరళలలో బీజేపీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు శ్రీధరన్. అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వివరించారు.

లవ్ జిహాద్ నిజమే – మెట్రోమ్యాన్ శ్రీధరన్