Love jihad case : ట్యూషన్‌కు వచ్చిన యువతిని బలవంతంగా..

404

ఉత్తర ప్రదేశ్ లో రోజుకో లవ్ జిహాద్ కేసు బయటపడుతుంది. తాజాగా ట్యూషన్ కి వచ్చే 18 ఏళ్ల యువతిని లవ్ జిహాద్ పేరుతొ కిడ్నాప్ చేసి మతం మార్చే ప్రయత్నం చేశాడు. అమన్ అనే వ్యక్తి మీరట్ లో ట్యూషన్ చెబుతాడు. ట్యూషన్ కి వచ్చే 18 ఏళ్ల యువతిపై కన్నేశాడు. మతం మారితే పెళ్లి చేసుకుంటానని కోరగా అందుకు ఆ యువతి అంగీకరించలేదు..

దింతో అమన్ బెదిరింపులకు దిగాడు. ఆమె తమ్ముడిని హత్యచేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దింతో ఏం చెయ్యాలో తెలియని యువతి మతం మారేందుకు అమన్ వెంట ఢిల్లీ వెళ్ళింది. ట్యూషన్ కి వెళ్లిన కూతురు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ట్యూషన్ వద్దకు వెళ్లి చూశారు. ట్యూషన్ దగ్గర ఎవరు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇరువురిని గుర్తించారు అమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా లవ్ జిహాద్ పై యూపీ ప్రభుత్వం కొత్త చట్టం చేసిన విషయం విదితమే, పెళ్లికోసం ఎవరైనా బలవంతపు మతమార్పిడికి పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈ కేసులో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తారు.

Love jihad case : ట్యూషన్‌కు వచ్చిన యువతిని బలవంతంగా..