లవ్ జిహాద్ కేసు.. ఆరుగురుని జైలుకు పంపిన అధికారులు

74

ఓ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు. అనంతరం పెళ్లి చేశారు.. తన కూతురు కిడ్నాప్ అయిందని ఆమె తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని బంధించిన ప్రాంతాన్ని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆరుగురిని జైలుకు పంపారు.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఎటా ప్రాంతంలో జరిగింది. కాగా ఈ విషయంపై యువతి తండ్రి మాట్లాడుతూ, మార్కెట్ కు వెళ్లిన తన కూతురుని కిడ్నాప్ చేశారని, అనంతరం బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేశారని వివరించారు. పోలీసులు తమ కూతురుని రక్షించి తమకు అప్పగించారని తెలిపాడు.

కాగా కొద్దిరోజుల క్రితమే లవ్ జిహాద్ ను కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికోసం మతం మార్చితే మూడేళ్ళ నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా చట్టం చేశారు.