ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో లైంగిక దాడి.. చివరకు ఏం జరిగిందంటే..

87

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేమలేఖలు కనుమరుగై పోయాయి. గతంలో ప్రేమించడం అంటే ఓ కళ.. నెలల తరబడి పోరాటం చేస్తే ఆ ప్రేమ సక్సెస్ అయ్యేవి.. కొన్ని ప్రేమలు ఫెయిల్ అయి కన్నీటిని మిగిల్చేవి.. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేమకు విలువే లేకుండా పోయింది. పేస్ బుక్ వాట్సాప్ లలో పరిచయమైన అనామకులను ప్రేమించి మోసపోతున్నారు. ఒకరిద్దరైతే పర్వాలేదు రోజులు పదులసంఖ్యలో యువతి యువకులు సోషల్ మీడియా ప్రేమ పేరిట మోసపోతున్నారు. ఒక్క సందేశం పంపి, ఓ చాక్లెట్ ఇస్తే నువ్వే నా ప్రియుడు అని వెర్రిగా నమ్మేస్తున్నారు అమ్మాయిలు..

ఇక అమ్మాయిలేం తక్కువలేరు వారు చేసే మోసాలు వారు చేస్తున్నారు. ఈ విలువలు లేని ప్రేమలు చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరి, కేసులపాలవుతున్నారు. ఇటువంటివి ప్రతి రోజు కోకొళ్లలుగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సోషల్ మీడియా ప్రేమికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తమ ఇంట్లో వారు పెళ్ళికి ఒప్పుకోవడం లేదని, ఇంట్లో తెలిస్తే కొడతారని భయంతో జీవం తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ఓ సోషల్ మీడియా ప్రేమ ఘటన పోలీస్ స్టేషన్ కు చేరింది. పేస్ బుక్ ద్వారా పరిచయమైన యువకుడు తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి అనేసరికి మొహం చాటేస్తున్నాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇరవై మూడేళ్ళ యువతికి రెండేళ్ల క్రితం అస్లాం ఖాన్(24) అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. చందానగర్‌లోని మంజీరా రోడ్డులో నివసించే అస్లాంఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ పరిచయం శారీరక సంబంధం వరకు వెళ్ళింది. ఇద్దరు కలిసి అనేక సార్లు ఓయో రూమ్ కి వెళ్లారు. ఆ సమయంలోనే అస్లాం ఖాన్ ఏకాంతంగా ఉన్న వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాడు.

కొద్దిరోజుల క్రితం యువతి పెళ్లి విషయం ఎత్తడంతో దూరం పెట్టాడు. యువతి దగ్గరవడానికి ప్రయత్నించినా యువతి సందేశాలను స్పందించలేదు. ఇక యువతి ఇంట్లో వారు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ విషయం అస్లాంకు తెలియడంతో గతంలో తీసిన ఫొటోస్ మీ బందువులకు పంపుతానంటూ వేధింపులు మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా.. మరొకరిని చేసుకునేందుకు సిద్ధమవుతుంటే అడ్డుపడి మానసికంగా వేదించడం మొదలు పెట్టాడు. దింతో కొన్నాలు భరించిన యువతి దైర్యం చేసి ఇంట్లో వారికీ చెప్పింది. దింతో వారు జూబ్లీహిల్స్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో లైంగిక దాడి