ఐఏఎస్ అధికారి సోదరుడు అనుమాస్పద మృతి

227

సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సోదరుడు సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లా పిల్కానీ పారిశ్రామిక ప్రాంతంలో అంకుల్ అగర్వాల్ మృతదేహాన్ని ఆయన ఫ్యాక్టరీకి సమీపంలోని పొలాల్లో కనుగొన్నారు. ఈ విషయంపై ఎస్పీ అతుల్ శర్మ మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు అంకుల్ అగర్వాల్ కోసం గాలించామని ఫ్యాక్టరీకి కొద్దీ దూరంలో మృతిచెంది ఉన్నారని తెలిపారు. అతడి వద్ద లైసెన్సుడ్ రివాల్వర్ ఉందని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా ఎప్పటిలాగానే సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీకి వెళ్లిన అగర్వాల్ కొద్దీ సేపటి తర్వాత ఫ్యాక్టరీ బయటకు వెళ్లారు. ఎంతకు తిరిగి రాలేదు దింతో పోలీసులకు సమాచారం అందించారు ఫ్యాక్టరీ సిబ్బంది. సమాచారం మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోదరుడి మృతి విషయం తెలిసిన వెంటనే లవ్ అగర్వాల్ ఢిల్లీ నుంచి సహారన్పూర్ జిల్లాలోని స్వగ్రామానికి వచ్చారు. అధికారులతో మాట్లాడారు. ఇక మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. రిపోర్ట్స్ రావలసి ఉంది. ఈ విషయంపై సీఎం యోగి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం.

ఐఏఎస్ అధికారి సోదరుడు అనుమాస్పద మృతి