ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

83

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సంబందించిన తీర్పును హైకోర్టు వెలువరించింది. ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఎస్ఈసి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం విచారణ పూర్తి చేసింది. రెండు రోజులపాటు జడ్జిమెంట్ రిజర్వులో పెట్టి గురువారం వెలువరించింది. ఎస్ఈసి వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్నికలకు అడ్డురాదని ఎస్ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు విన్నవించారు.

కాగా పంచాయితీ ఎన్నికలపై ఏడాది కాలంగా అధికారపార్టీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో సారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్. దీనిని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దింతో వ్యవహారం కోర్టుకు చేరింది. పలు దఫాలుగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. దింతో పంచాయితీ ఎన్నికలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది.

ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్