స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

135

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వార్ ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. సుమారు ఏడాది కాలంగా ఎన్నికలపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కష్టమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది.. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టుకు చేరింది ఎన్నికల వ్యవహారం.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చెబుతున్న కారణాలను తప్పుబట్టింది హైకోర్టు. వాక్సినేషన్ అనేది ఎన్నికల నిర్వహణకు అడ్డురాదని పేర్కొంది కోర్టు. ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.