పెరిగిపోతున్న లోన్ యాప్ బాధితులు.. ఆదివారానికి 100 మంది

53

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆదివారం హైదరాబాద్ లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 100 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో ఆదివారం 16 కేసులు నమోదు కాగా, రాచకొండ పరిధిలో 30 కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పరిధిలో 50 కేసులు నమోదైనట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితులు లోన్ యాప్ ప్రతినిధులు మాట్లాడుతున్న వాయిస్ లను పోలీసులకు వినిపించారు. అత్యంత గోరంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంట్లోని ఆడవారికి ఫోన్ చేసి విసిగిస్తున్నారని పలువురు పోలీసుల ముందు వాపోయారు. కాగా లోన్ యాప్ కంపెనీలు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ తో డబ్బు వసూలు చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా గతంలో పలు చైనా కంపెనీలు దేశంలో నాన్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అనుమతులు పొందాయి. అనుమతులు పొందిన యాప్స్ పై దృష్టిపెట్టారు పోలీస్ అధికారులు.

ఇక లోన్స్ తీసుకున్న వారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, చిరు వ్యాపారులే అధికంగా ఉన్నారు

పెరిగిపోతున్న లోన్ యాప్ బాధితులు.. ఆదివారానికి 100 మంది