తాగారా? స్నానం చేశారా? 4 రోజుల్లో 758.76 కోట్ల లిక్కర్ అమ్మకాలు

149

కొత్త ఏడాది రాష్ట్ర ఖజానాకు భారీగా డబ్బు వచ్చి చేరింది. నూతన సంవత్సరం సందర్బంగా ఏకంగా 758. 76 కోట్ల రూపాయల మద్యం తాగారు మందు బాబులు. ఇవి మొత్తం కేవలం నాలుగు రోజుల్లో జరిగినవే.. డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో 8 లక్షల 61 వేల లిక్కర్ కేసులు, 6.62 లక్షల బీరు కేసులను తాగేశారు మందుబాబులు.

ఇక డిసెంబర్ 28 న 205 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా, 29న 150 కోట్లు, 30 న 211 కోట్లు, 31 న 193 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు. గత న్యూ ఇయర్ తో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు అధికంగా ఉన్నట్లు తెలిపారు అధికారు. ఇక 2020 మొత్తం 25 వేల 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు అధికారులు. ఏపీలో కూడా మద్యం అమ్మకాలు భారీగానే జరిగాయి. డిసెంబర్ నెలలో 2,180 కోట్ల అమ్మకాలు జరిగాయి.

తాగారా? స్నానం చేశారా? 4 రోజుల్లో 758.76 కోట్ల లిక్కర్ అమ్మకాలు