తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు లైన్ క్లియర్

62

తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు కూడా విధించింది.. ఆటగాళ్ల సంఖ్య 150 కి మించరాదని షరతు విధించింది. తమిళ సంప్రదాయ ఆటలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు ఎద్దుల ఓనర్లు కూడా తప్పనిసరిగా కరోనా నెగటివ్ రిపోర్ట్ చూపించాలని నిబంధన విధించింది.

జల్లికట్టు క్రీడ చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా 50 శాతం కంటే మించకూడదని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలలో పేర్కొంది. ప్రతియేటా సంక్రాంతికి తమిళనాడులో జల్లికట్టు పోటీలు జరుగుతాయి.. అయితే ఈసారి జల్లికట్టు కరోనా అడ్డంకిగా మారింది.. ఈ క్రమంలో పోటీల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.. అయితే తమిళనాడు సర్కార్ షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో జల్లికట్టు నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్టయింది.