కేసీఆర్ ను గవర్నర్ పదవినుంచి తీసేయాలని గవర్నర్ కు లేఖ

142

కేసీఆర్ ను సీఎం పదవి నుంచి తక్షణమే తొలగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు లేఖ రాశారు. సీఎం పదవిని కేసీఆర్ కాలి చెప్పుతో పోల్చడంపై అరవింద్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో సీఎం కేసీఆర్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, కేసీఆర్‌ కుటుంబంపై ఎమ్మెల్యేల్లో నమ్మకం పోయిన కారణంగానే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జరుగుతోందని అరవింద్‌ పేర్కొన్నారు.

సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరవింద్ ఆదివారం జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంపై మాట్లాడారు. ఈ సమావేశంలో డ్రామాలు తెరాసారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న అపజయాలతో పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో, ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ఉన్నారని అందుకే ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

కాగా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సీఎం పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ సీఎం అవుతారంటూ వార్తలపై స్పందించే సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అపోహలు సృష్టిస్తే నిర్దాక్షిన్యంగా పార్టీలోంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

కేసీఆర్ ను గవర్నర్ పదవినుంచి తీసేయాలని గవర్నర్ కు లేఖ